టీ20 వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాలు ఉన్నాయి: మాక్స్‌వెల్‌ | T20 World Cup 2021: Glenn Maxwell Confident Of Australia Chances | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: ఆరోజు మమ్మల్ని ఆపటం ఎవరితరం కాదు..

Published Wed, Sep 15 2021 2:43 PM | Last Updated on Wed, Sep 15 2021 2:56 PM

T20 World Cup 2021: Glenn Maxwell Confident Of Australia Chances - Sakshi

Glenn Maxwell On T20 World Cup Australia Chances: రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాకు గెలిచే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని ఆ జట్టు ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అన్నాడు. ఐసీసీ మెగా టోర్నీకి ముందు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడటం తమకు మేలు చేస్తుందని పేర్కొన్నాడు. తమదైన రోజు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెలరేగి ఆడతారని, అప్పుడు వారిని ఆపటం ఎవరితరం కాదని మాక్సీ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలి కాలంలో జరిగిన టీ20 సిరీస్‌లలో ఆసీస్‌ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తంగా 15 మ్యాచ్‌లు ఆడగా... కేవలం నాలుగింటిలో మాత్రమే గెలుపొందింది. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌లకు సిరీస్‌లు సమర్పించుకుని చతికిలపడింది.

ఈ నేపథ్యంలో అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఏమేరకు రాణించనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మాక్స్‌వెల్‌ ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ ప్రదర్శన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ‘‘మా లైనప్‌ ఎంతో బలంగా ఉంది. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల విజేతలు చాలా మందే ఉన్నారు. ప్రత్యర్థి ఎవరైనా సరే తమదైన రోజు చెలరేగి ఆడటం మాకు అలవాటు. ఆ సమయంలో మమ్మల్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు’’ అని సహచర ఆటగాళ్ల ప్రతిభ గురించి చెప్పుకొచ్చాడు. 

అదే విధంగా.. ప్రపంచకప్‌నకు ముందు ఐపీఎల్‌లో ఆడటం తమకు ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, మెగా టోర్నీ(ప్రపంచకప్‌)లో ఆడే ఏ జట్టు బలహీనమైదని కాదని, కష్టపడితేనే విజయం సాధించగలమని మాక్స్‌వెల్‌ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2021లో భాగంగా ఈ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లీష్, కేన్‌ రిచర్డ్‌సన్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, స్వీప్సన్, ఆడమ్ జంపా

రిజర్వు ప్లేయర్లు: డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్

చదవండి: T20 World Cup 2021: ‘పాకిస్తాన్‌తో తలపడే నా జట్టు ఇదే’.. అతడికి చోటివ్వని గౌతీ!
IPL 2021 Phase 2: ఇరగదీసిన డివిల్లియర్స్‌.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement