
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ సూపర్ ఓవర్‌లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్‌ఏ ఓ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన పాక్‌కు ఊహించని షాక్ ఇవ్వడం క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఈ ఘోర పరాభవాన్ని ఊహించని పాక్ ఇంకా షాక్‌లోనే ఉండిపోయింది. అన్ని విభాగాల్లో తమకంటే పటిష్టంగా ఉన్న పాక్‌పై యూఎస్‌ఏ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఐసీసీ టాప్-5 బిగ్గెస్ట్ అప్‌సెట్స్ (టీ20 వరల్డ్‌కప్) జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పాక్-యూఎస్‌ఏ మ్యాచే అగ్రస్థానంలో నిలువడం విశేషం. ఈ జాబితాలో మిగతా నాలుగు సంచలనాలు వరుస క్రమంలో ఇలా ఉన్నాయి.
2022 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్
2022 ప్రపంచకప్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన నమీబియా
2016 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించిన ఆఫ్ఘనిస్తాన్
2009 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఓడించిన నెదర్లాండ్స్
పై పేర్కొన్న మ్యాచ్‌లను ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అతి భారీ సంచలనాలుగా పరిగణించింది.
ఇదిలా ఉంటే, యూఎస్‌ఏతో నిన్న జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన పాక్.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటలేక చేసిన ఓ మోస్తరు స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. ఫలితంగా మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో సైతం తేలిపోయిన పాక్.. తొలుత బౌలింగ్ చేసి 18 పరుగులు సమర్పించుకుంది. అనంతరం ఛేదనలోనూ చేతులెత్తేసి 13 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అతి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
స్కోర్ వివరాలు..
పాక్ 159/7 (20)
యూఎస్‌ఏ 159/3 (20)
సూపర్ ఓవర్..
యూఎస్‌ఏ 18/1
పాక్ 13/1
సూపర్ ఓవర్‌లో యూఎస్‌ఏ విజయం
Comments
Please login to add a commentAdd a comment