న్యూఢిల్లీ/ముంబై: భారత పారిశ్రామిక రంగంలోనే కాదు... క్రీడారంగంలోనూ ‘టాటా’ చెరగని ముద్ర వేసింది. స్వాతం్రత్యానికి పూర్వంలో భారత్ 1920లో అంట్‌వర్ప్ ఒలింపిక్స్‌కు టాటా గ్రూపే స్పాన్సర్‌గా వ్యవహరించింది. అప్పటి నుంచి క్రీడలపై కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తూనే వచ్చింది.
రతన్ టాటా వచ్చాక ఇది మరింతగా పెరిగింది. జీవనశైలిలో క్రీడలు భాగమేనని రతన్ అనే వారు. ‘టాటా’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), టాటా స్టీల్ చెస్ ఇలా ఒకటేమిటి ఆర్చరీ, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్), అథ్లెటిక్స్‌లలో రతన్ ఉదారత, దార్శనీయత, నిబద్ధత నిరుపమానమని పలువురు క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు.
» 1991లో జేఆర్‌డీ టాటా స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పిన నాటి నుంచి ఫుట్‌బాల్, హాకీ, ఆర్చరీ, ఈక్వె్రస్టియన్, బాక్సింగ్, కరాటే, రాకెట్ స్పోర్ట్స్ ఇలా 19 క్రీడాంశాలకు ప్రసిద్ధ శిక్షణ సంస్థగా టాటా స్పోర్ట్స్ అకాడమీ ఎదిగిందని ఇందులో రతన్ పాత్ర చాలా కీలకమని అకాడమీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు అన్నారు.
» 1924లో ఏర్పాటైన భారత ఒలింపిక్ సంఘానికి తొలి అధ్యక్షుడు సర్ దోరబ్జి టాటా కావడం విశేషం. నెదర్లాండ్స్‌లో జరిగే టాటా స్టీల్ చెస్‌ను కొందరు చెస్ దిగ్గజాలు ‘వింబుల్డన్ ఆఫ్ చెస్’గా అభివర్ణిస్తారు. 2007 నుంచి టాటా స్టీల్ సంస్థ స్పాన్సర్‌షిప్‌లోనే ఈ టోర్నీ జరుగుతోంది.
స్వాతం్రత్యానంతరం పది మంది గొప్ప వాళ్ల జాబితాను తయారు చేస్తే అందులో రతన్ అగ్రస్థానంలో ఉంటారు. తన కోసం కాకుండా దేశం కోసం ఒక వ్యక్తి ఓ వ్యవస్థను ఎలా మార్చగలడో, ఓ పరిశ్రమను ఎలా సృష్టించగలడో నిరూపించిన దిగ్గజం రతన్ టాటా. గొప్ప మానవతావాది. మూగజీవాల పట్ల కారుణ్యం, సమాజం పట్ల బాధ్యత ఉన్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. నేను ఆయన్ని చాలాసార్లు కలిశాను. ఆయన చాతుర్యం అపారం. ఆయనెప్పుడు మన మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. దేశం కోసం ఆయనేం చేశాడో, భారత పారిశ్రామిక రంగాన్ని దశదిశలా వ్యాప్తిచేసిన ఆయన గురించి ఎంత చెప్పినా... వర్ణించినా తక్కువే –కపిల్‌దేవ్, భారత క్రికెట్ దిగ్గజం
పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వానికి నిలువెత్తు రూపం రతన్ టాటా ఇక లేరనే వార్త అత్యంత విచారకరం. చెస్ టోర్నీ ఆయన ఎంతో చేశారు. టాటా స్టీల్ చెస్‌లో ఆడటమే గొప్ప గౌరవంగా భావించేలా ఆ టోర్నీని మార్చేశారు. –చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్
శ్రీ రతన్ టాటా మరణవార్త నన్ను దుఃఖంలో ముంచేసింది. ఆయన దూరదృష్టి అద్భుతం. ఆయనతో నేను గడిపిన క్షణాలు, సంభాషణ జీవితంలో మరచిపోలేను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్థస్తున్నా. –ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా
రతన్ టాటా చూపిన మార్గం, చేసిన దిశానిర్దేశం దేశం ఎప్పటికి మరచిపోదు. మేమంతా మిమ్మల్ని అనుసరిస్తాం. –బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్
రతన్ ఒక్క పారిశ్రామిక రంగానికే కాదు... భారత సమాజానికి ఎనలేని సేవలందించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. –దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే
Comments
Please login to add a commentAdd a comment