కొత్త అవతారంలో రోహిత్‌ శర్మ.. సెప్టెంబర్‌ 4న డబుల్‌ ధమాకా! | Team India Captain Rohit Sharma Instagram Post Leaves Fans Guessing | Sakshi
Sakshi News home page

Rohit Sharma: కొత్త అవతారంలో రోహిత్‌ శర్మ.. సెప్టెంబర్‌ 4న డబుల్‌ ధమాకా!

Published Thu, Sep 1 2022 9:06 PM | Last Updated on Thu, Sep 1 2022 9:22 PM

Team India Captain Rohit Sharma Instagram Post Leaves Fans Guessing - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం టీమిండియాకు ఆసియాకప్‌ను అందించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే టీమిండియాను సూపర్‌-4 దశకు చేర్చిన రోహిత్‌.. టైటిల్‌ అందుకునేందుకు మరింత దగ్గరయ్యాడు. క్రికెటర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయిన రోహిత్‌ శర్మ కొత్త అవతారంలో మెరవనున్నాడు. త్వరలోనే ''మెగా బ్లాక​బాస్టర్‌'' అనే ఫన్‌ షూట్‌తో సినిమా రంగంలో అడుగుపెట్టనున్నాడు. తాజాగా షూట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను రోహిత్‌ శర్మ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు.

''బట్టర్‌ఫ్లైస్‌ ఇన్‌ మై స్టమక్‌.. ఎ డెబ్యూట్‌ ఆఫ్‌ కైండ్‌ # Trailer Out 4th September# MegaBlockBuster'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఎప్పుడు టీమిండియా జెర్సీలో కనిపించే హిట్‌మ్యాన్‌.. ఈసారి సినిమా ఎంట్రీలో భాగంగా చెక్స్‌ షర్ట్‌తో బబ్లీ ఫేస్‌తో క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. రోహిత్‌ లుక్స్‌ స్టన్నింగ్‌గా ఉండడంతో  క్రికెట్‌ ఫ్యాన్స్‌..  సినిమాలో రోహిత్‌ ఇంకెంత అందంగా కనిపిస్తాడో అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

అన్నట్లు ఈ సినిమాలో రోహిత్‌ శర్మతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా నటిస్తుండడం విశేషం. వీరితో పాటు సీతారామం ఫేం.. రష్మికా మందాన కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా తెలియాలంటే సెప్టెంబర్‌ 4న ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యేవరకు వేచిచూడాల్సిందే.  ఇదే సెప్టెంబర్‌ 4న ఆసియాకప్‌లో టీమిండియా మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం హాంకాంగ్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప పాక్‌ విజయం సాధించడం ఖాయం.

దీంతో గ్రూఫ్‌-ఏ నుంచి రెండో జట్టుగా సూపర్‌-4లో అడుగుపెట్టనున్న పాకిస్తాన్‌.. సెప్టెంబర్‌ 4న భారత్‌తో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. దీంతో ఒకేరోజు రెండు డబుల్‌ ధమాకాలు ఉండడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇక మరో రెండు నెలల్లో ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌ 2022కు రోహిత్‌ శర్మ కెప్టెన్‌ హోదాలో తొలిసారి టీమిండియాను నడిపించనున్నాడు. 

చదవండి: Asia Cup 2022 Super 4: పంత్‌పై మళ్లీ వేటు తప్పదా..?

Shahnawaz Dahani: ఎంపికయ్యానన్న సంతోషం.. తండ్రి సమాధి వద్ద బోరుమన్న క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement