
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ భారత్‌ను గెలిపించాడు. అఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే లభించాయి. అయితే నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదిన అక్షర్ పటేల్ భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. తద్వారా వన్డేల్లో ప్రపంచ రికార్డును భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. 2006 నుంచి ఇప్పటి వరకు విండీస్‌పై వరుసగా 12 వన్డే సిరీస్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. ఇక జింబాబ్వేపై వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో విజయం సాధించిన పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే
వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
టాస్: విండీస్- బ్యాటింగ్
వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు)
సెంచరీతో చెలరేగిన షై హోప్(115 పరుగులు)
భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు)
విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (64 పరుగులు, ఒక్క వికెట్)
అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54)
చదవండి: IND Vs WI 2nd ODI: నరాలు తెగే ఉత్కంఠ.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment