పూణే: రికర్డులేవైనా.. అన్నీ తన ఖాతాలోనే ఉండాలనుకున్నాడో ఏమో, టాస్ ఓడిపోవడంలోనూ తనదైన ముద్రను వేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ముచ్చటగా మూడోసారి టాస్ కోల్పోయిన టీమిండియా కెప్టెన్.. ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు అంగీకరించాడు. ప్రస్తుత ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో (నాలుగు టెస్ట్‌లు, ఐదు టీ20లు, 3 వన్డేలు) మొత్తం 12 సార్లు టాస్ వేయగా.. టీమిండియా కెప్టెన్ కేవలం రెండు సార్లు మాత్రమే టాస్ నెగ్గాడు. మిగిలిన 10 సందర్భాల్లో టాస్ ఓడిపోయాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో, అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో మాత్రమే కోహ్లీ టాస్ నెగ్గాడు. దీంతో కోహ్లీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దరిద్రం అంటే నీదే భయ్యా.. టాస్ విషయంలో దరిద్రం అదృష్టం పట్టినట్లు పట్టిందంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.
కాగా, టాస్ ఓడిపోవడంపై టీమిండియా కెప్టెన్ స్పందిస్తూ.. టాస్ గెలవడమనేది మన చేతుల్లో ఉండదని, ప్రస్తుత సిరీస్‌లో చాలాసార్లు బౌలింగ్ తీసుకుందామని భావించామని.. కానీ కుదరలేదని పేర్కొన్నాడు. అయితే టాస్‌లు గెలవకపోయినా మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌లు కైవసం చేసుకోవడమే ముఖ్యమని కొందరు నెటిజన్లు అభిప్రాయాపడుతున్నారు. ఇదిలా ఉండగా మూడో వన్డేలో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 329 పరుగలకు ఆలౌటై, ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్నే ఉంచింది. టీమిండియా బౌలర్ భవనేశ్వర్ స్వింగ్ మాయాజాలం చేయడంతో ఇంగ్లండ్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment