
చెన్నై: ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టు తర్వాత పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 5వ తేదీన చెన్నై వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టుమ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు చెన్నైలోని హోటల్‌రూంలో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి తన రూమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
'క్వారంటైన్ సమయంలో మనసును ఉల్లాసపరిచేది జిమ్, మ్యూజిక్ పరికరాలు మాత్రమే. మ్యాచ్‌కు ముందు ఇలా కసరత్తులతో సన్నద్దమవడానికి కూడా టైం కేటాయించాలి. ఆసీస్‌తో మొదటి టెస్టు మ్యాచ్ తర్వాత పెటర్నిటీ సెలవులపై ఇండియాకు వచ్చాకా కసరత్తులు చేసేందుకు టైం దొరకలేదు. ఇంట్లో ఉన్నంతసేపు పాపతో బాగా టైం స్పెండ్ చేశాడు. రేపు జరగబోయే టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శన చేయాలంటే ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాలి. ఈరోజు మీఅందరికి మంచిరోజు కావాలని కోరుకుంటున్నా అంటూ కోహ్లీ పోస్ట్ చేశాడు. చదవండి: 7 వికెట్లు పడగొట్టిన అలీ.. ఐసీసీ ప్రశంసలు