మైదానంలో కుప్పకూలిన వెస్టిండీస్‌ బౌలర్‌.. ఒక్క సారిగా షాక్‌! | West Indies fast bowler Shamilia Connell Collapses On Field | Sakshi
Sakshi News home page

Women's World Cup 2022: మైదానంలో కుప్పకూలిన వెస్టిండీస్‌ బౌలర్‌.. ఒక్క సారిగా షాక్‌!

Published Sat, Mar 19 2022 5:49 PM | Last Updated on Sat, Mar 19 2022 5:49 PM

West Indies fast bowler Shamilia Connell Collapses On Field - Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 47 ఓవర్‌ జరుగుతుండగా మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న విండీస్‌ ఫీల్డర్‌ షమిలియా కానెల్ ఒక్క సారిగా కుప్పకూలింది. దీంతో ఒక్క సారిగా సహచర ఆటగాళ్లు ఆమె దగ్గరకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అయితే కానెల్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని టీమ్ కెప్టెన్ స్టఫానీ టేలర్‌ వెల్లడించింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది.

విండీస్‌ బ్యాటర్‌ కాంప్‌బెల్‌ 53 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో ఆ మాత్రం స్కోరైన చేయగల్గింది. ఇక 141 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 136 పరుగులకే ఆలౌటైంది. హేలీ మ్యాథ్యూస్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో విండీస్‌ మూడో స్ధానంలో నిలిచింది.

చదవండి: Pooja Vastrakar: ప్రపంచకప్‌లో అతి భారీ సిక్సర్‌ బాదిన టీమిండియా బ్యాటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement