విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ దూరమయ్యాడు. వర్క్‌లోడ్ కారణంగా రెండో టెస్టుకు సిరాజ్‌కు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అతడి స్ధానంలో ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చాడు.
"వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టు నుంచి సిరాజ్‌ను జట్టు మేనెజ్‌మెంట్ రిలీజ్ చేసింది. ఇటీవలి కాలంలో అతడు నిర్విరామంగా క్రికెట్ ఆడుతుండడంతో విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్‌మెంట్ భావించింది. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టుకు సిరాజ్ జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటాడు.
అదే విధంగా అవేష్ ఖాన్ తిరిగి జట్టుతో కలిశాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సిరాజ్ విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఇక వైజాగ్ టెస్టుతో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అదే విధంగా కుల్దీప్ యాదవ్ ఛానాళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్
చదవండి: IND vs ENG: ఏంటి రోహిత్ ఇది..? యువ స్పిన్నర్ ట్రాప్‌లో చిక్కుకున్న హిట్‌మ్యాన్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment