IPL 2022: DC Creates Record Of Winning With Most Balls To Spare Chase 100 Above Score, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2022 DC Vs PBKS: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అరుదైన రికార్డు.. తొలి జ‌ట్టుగా!

Apr 20 2022 11:52 PM | Updated on Apr 21 2022 8:31 AM

Winning with most balls to spare chasing a 100 Above Score - Sakshi

PC: IPL

IPL 2022 DC Vs PBKS: ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అరుదైన ఘ‌న‌త సాధించింది. అత్య‌ధిక బంతులు(57) మిగిలిండగానే 100 కుపైగా ల‌క్ష్యాన్ని ఛేదించిన తొలి జ‌ట్టుగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో 116 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ 63 బంతుల్లోనే ఢిల్లీ చేధించింది. గ‌తంలో ద‌క్క‌న్ ఛార్జ‌ర్స్(స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌) 48 బంతులు మిగిలిండగానే ముంబై ఇండియ‌న్స్‌పై 155 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది.

ఇక  మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. 116 ప‌రుగుల స్ప‌ల్ప‌ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ కోల్పోయి 10.3 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఓపెన‌ర్లు వార్న‌ర్(60), పృథ్వీ షా(41) ప‌రుగుల‌తో చెల‌రేగారు.అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 115 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌లో ఖలీల్ అహ్మద్,కుల్ధీప్ యాద‌వ్, అక్ష‌ర్ ప‌టేల్‌, ల‌లిత్ యాద‌వ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. . ముస్తాఫిజ‌ర్ రెహ్మ‌న్ ఒక్క‌ వికెట్ సాధించాడు.  

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement