
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 33 ఓవర్‌లో రెండో బంతికి సౌద్ షకీల్‌ను ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపిన కుల్దీప్.. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి ఇఫ్తికర్ అహ్మద్ క్లీన్ బౌల్డయ్యాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కుల్దీప్ తన 10 ఓవర్ల కోటాలో కేవలం 35 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
కుప్పకూలిన పాకిస్తాన్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో భారీ స్కోర్ దిశగా వెళ్తున్నట్లు కన్పించిన పాకిస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్, సిరాజ్, బుమ్రా, హార్దిక్, జడేజా తలా రెండు వికెట్లతో చెలరేగారు. పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ ఆజం(50),మహ్మద్ రిజ్వాన్(49) టాప్ స్కోరర్లగా నిలిచారు.
చదవండి: ODI WC 2023: సిరాజ్ సూపర్ డెలివరీ.. బాబర్ ఆజం ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment