బ్రిస్బేన్: ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 3 వికెట్ల తేడాతో స్టన్నింగ్ విజయం సాధించడంపై పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. భారత బ్యాట్స్‌మెన్ల అసమాన పోరాటం అందరిని ఆకట్టుకుంది. నాలుగో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆసీస్‌ను వరుసగా రెండోసారి సొంతగడ్డపై ఓడించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. 'హార్టీ కంగ్రాట్స్ టీమిండియా.. ఇది నిజంగా గొప్ప విజయం. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా వేదికగా టీమిండియా విజయం సాధించి చరిత్రను తిరగరాసింది. మ్యాచ్‌లో మీరు కనబరిచిన అద్భుత ప్రదర్శన పట్ల ఈరోజు దేశం మొత్తం గర్విస్తుంది.' అని తెలిపారు.
చదవండి: టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన
ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం
ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక విజయం సాధించిన టీమిండియాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం చిరస్మరణీయంగా మిగిలిపోతుందన్నారు.ఈ సందర్భంగా కెప్టెన్ రహానేతో పాటు జట్టు సభ్యులను కేసీఆర్ అభినందించారు. టీమిండియా విజయంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం.. టీమిండియా ఆటగాళ్లు భారత్‌ను గర్వించేలా చేశారు. కీలక ఆటగాళ్లు లేకున్నా కుర్రాళ్లతోనే అద్భుతం చేసి చూపించారు. 2021 సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించారు 'అని కేటీఆర్ అన్నారు.చదవండి: చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం
Comments
Please login to add a commentAdd a comment