
ఆడుకుంటుండగా..
● ధాన్యం తొట్టెలో పడి బాలుడి మృతి
నెల్లూరు సిటీ: ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదశాత్తు ధాన్యం తొట్టెలో పడి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ మండలంలోని గుండ్లపాళెం గ్రామంలోని శరణ్య రా అండ్ బాయిల్డ్ రైస్‌మిల్లులో బిహార్‌కు చెందిన మంగళ పాశ్వాన్ తన కుటుంబంతో నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నారు. మిల్లు వద్ద గదిలో కాపురం ఉంటూ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం అతని కుమా రుడు సత్యం కుమార్ (11) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ధాన్యం పడే తొట్టెలో పడ్డాడు. దీనిని ఎవరూ గుర్తించలేదు. కొంతసేపటికి బాలుడు తొట్టెలోని బియ్యంలో మునిగిపోయాడు. అక్కడి వారికి కాళ్లు కనిపించడంతో వెంటనే ధాన్యం పడటాన్ని ఆపారు. సత్యం కుమార్‌ను బయటికి తీసి హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment