భోజనం బాగాలేదని విద్యార్థులు నిరసన
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ఏసీఎస్‌ఆర్ కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా అన్నం సరిగా ఉడకడంలేదంటూ, కూరలు సైతం బాగాలేకపోవడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్న సంఘటనలు జరిగాయని తల్లిదండ్రులు తెలిపారు. దీని గురించి భోజన పథకం నిర్వాహకులను ప్రశ్నిస్తే వెటకారంగా సమాధానం చెప్పారని ఓ విద్యార్థి తల్లి పేర్కొంది. ఈ విషయమై హెచ్‌ఎం హజరత్తయ్యను సంప్రదించగా భోజనం బాగాలేదని విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, నిర్వాహకురాలిని మందలించినట్లు తెలిపారు.
సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీల ధర్నా
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పొదలకూరు రోడ్డులోని సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయనందున హెల్పర్లు, మినీవర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు పెట్టుబడులు పెట్టి కేంద్రాలను నిర్వహిస్తున్నారన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనంగా రూ 26వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్, రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు కొండా ప్రసాద్, నగర అధ్యక్షుడు అత్తిమూరు శ్రీనివాసులు, నాయకులు షాహినాబేగం, నాగభూషణమ్మ, సంపూర్ణమ్మ, రజని, కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు.
చౌక దుకాణాలకు
రేషన్ అలాట్‌మెంట్
నెల్లూరు (పొగతోట): జిల్లాలోని వివిధ చౌకదుకాణాలకు పదిశాతం రేషన్ విడుదల చేసినట్లు డీఎస్‌ఓ అంకయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’లో సోమవారం రేషన్ బియ్యం కోటాలో కోత శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించారు. చౌక దుకాణాలకు పదిశాతం రేషన్ విడుదల చేశారు. కార్డుదారులు ఇబ్బందులు పడకుండా రేషన్ సరఫరా చేస్తామని డీఎస్‌ఓ తెలిపారు.
ముందస్తు సమాచారం లేకుండా పెన్నా డెల్టాకు నీటి విడుదల
సోమశిల: అనంతసాగరం మండల పరిధిలోని సోమశిల జలాశయం నుంచి సోమవారం పెన్నా తీర ప్రాంతాల వారికి ఎలాంటి సమాచారం లేకుండా నీటిని విడుదల చేసినట్లు ప్రజలు తెలిపారు. దీనిపై జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దశరథరామిరెడ్డిని అడుగగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెన్నా దిగువ ప్రాంతంలోని రైతుల తాగు, సాగునీటి అవసరం కోసం నీటిని విడుదల చేశామన్నారు.
22న ఫుట్‌బాల్
క్రీడాకారుల ఎంపికలు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సూపర్ కప్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే జట్టుకు క్రీడాకారులను ఈనెల 22న ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి బి.ఉమాశంకర్ సోమవారం తెలిపారు. ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉదయం 7.30 గంటలకు ఈ ఎంపికలు ప్రారంభమవుతాయని అన్నారు. ఎంపికై న క్రీడాకారులు మార్చిలో జరిగే టోర్నమెంట్‌లో కోరమాండల్ జోనల్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు.
భోజనం బాగాలేదని విద్యార్థులు నిరసన
భోజనం బాగాలేదని విద్యార్థులు నిరసన
భోజనం బాగాలేదని విద్యార్థులు నిరసన
Comments
Please login to add a commentAdd a comment