
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం
నెల్లూరు సిటీ: టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడు గోకుల్ రిష్వంత్ వివాహానికి హాజరయ్యేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన
హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వీపీఆర్ కన్వెన్షన్‌కు వచ్చి నూతన వధూవరులు గోకుల్ రిష్వంత్, దివిజలను ఆశీర్వదించారు. తిరిగి 2.18 నిమిషాలకు హెలిప్యాడ్ నుంచి ఉండవల్లికి బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment