
కాలువలో దూకి వివాహిత ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఓ వివాహిత నెల్లూరులోని జాఫర్‌సాహెబ్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మనుమసిద్దినగర్‌లో ఎం.వెంకటేశ్వర్లు, సుహాసిని (54) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. వెంకటేశ్వర్లు ఆర్‌ఆర్ స్ట్రీట్‌లోని కేఏసీ ప్లాజాలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి తల్లి రంగమ్మ ఈనెల నాలుగో తేదీన మృతిచెందారు. అప్పటి నుంచి సుహాసిని మానసికంగా కుంగిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం భర్త దుకాణానికి వెళ్లగా సుహాసిని ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయింది. ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి తెలియజేశారు. దీంతో ఆయన తన చిన్న కుమారుడు అజయ్‌తో కలిసి గాలింపు చేపట్టారు. పెన్నానది సమీపంలో వెతుకుతుండగా అక్కడున్న వారు కొద్దిసేపటి క్రితం జాఫర్‌సాహెబ్ కాలువలో ఓ మహిళ దూకడంతో స్థానికులు ఆమెను బయటకు తీసి ఒడ్డున పెట్టారని చెప్పారు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికి వెళ్లి చూడగా సదరు మహిళను సుహాసినిగా గుర్తించి చికిత్స నిమిత్తం నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సుహాసిని మృతిచెందినట్లు నిర్ధారించారు. బాధితులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బాలకృష్ణ మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment