
అటవీ అధికారులకు వాహనాలు
నెల్లూరు(అర్బన్): ఇటీవల ప్రభుత్వం పది మహీంద్ర బొలెరో నూతన వాహనాలు కొనుగోలు చేసి వాటిని నెల్లూరు వేదాయపాళెంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఉంచారు. వాటిని శుక్రవారం జిల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్‌ఓ) మహబూబ్ బాషా ప్రారంభించి రేంజ్ ఆఫీసర్లకు, కావలి సబ్ డీఎఫ్‌ఓకు హ్యాండోవర్ చేశారు. ఇందులో ఆరు వాహనాలను నెల్లూరు డివిజన్‌కు కేటాయించారు. మిగతా 4 వాహనాలను ఇతర డివిజన్లకు కేటాయించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మహబూబ్ బాషా మాట్లాడుతూ అడవుల్లో తనిఖీలకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. వేగంగా గమ్యస్థానానికి చేరుకునేందుకు ఉపకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రేంజర్లు రవీంద్ర, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.