ఈ ఏడాది ఎండుగడ్డి పాడి రైతుకు పరీక్ష పెడుతోంది. ఈసారి అనుకున్నంత రాలేదు. గడ్డి వామి వేసేటప్పుడు ఆ తేడా గమనించాం. వరి కోత అయిన తర్వాత వరిగడ్డిని ఇంటికి చేర్చుకొనేటప్పుడే తగ్గినది గుర్తించా. అందుకే వరికోతలు ముగిసిన పొలాల్లోకి గేదెలను మేతకు తోలుకు వెళ్తున్నా. ఎండుగడ్డిని ఇప్పుడే మేతగా వేస్తే ఎండా కాలంలో చాలక అవస్థలు పడాలి. గేదెలను పస్తు పెట్టలేను కదా. ఈ ఏడాది ఎండుగడ్డి తప్పక కొనుగోలు చేయాల్సిందే. – కప్పిర మల్లికార్జున,
పాడి రైతు, దగదర్తి గ్రామం