పొగాకుకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

పొగాకుకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు

Published Sat, Apr 5 2025 12:03 AM | Last Updated on Sat, Apr 5 2025 12:03 AM

పొగాకుకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు

పొగాకుకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు

కలిగిరి: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ లక్ష్మణరావు తెలిపారు. కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. పొగాకు కొనుగోలు చేసే కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. ఈ ఏడాది నాణ్యమైన పొగాకు దిగుబడులు వచ్చిన నేపథ్యంలో వేలంలో మంచి ధరలకు పొగాకు కొనుగోలు చేయాలని సూచించారు. రైతుల శ్రేయష్షుకు పొగాకు బోర్డు పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి వీ మహేష్‌కుమార్‌, కంపెనీల ప్రతినిధులు, పొగాకుబోర్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement