
ఫీజుల దోపిడీని అరికట్టాలి
కార్పొరేట్ యాజమాన్యాల ఫీజు దోపిడీని అరికట్టాలి. లక్షల్లో వసూలు చేస్తున్నా, బోధన, వసతులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు.
– ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ
●
ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి
పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి. ధరల పట్టికను నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించాల్సి ఉన్నా, ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి.
– లీలామోహన్, రాష్ట్ర కార్యదర్శి, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ
నామినల్ ఫీజులనే
వసూలు చేయాలి
నామినల్ ఫీజులనే వసూలు చేయాలని యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌కు జూమ్ మీటింగ్ ద్వారా ఆదేశాలు జారీ చేశాం. రెగ్యులర్ తరగతులను జూన్ రెండు నుంచి నిర్వహించాలి. ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులొస్తే చర్యలు చేపడతాం.
– ఆదూరు శ్రీనివాసులు, ఆర్‌ఐఓ

ఫీజుల దోపిడీని అరికట్టాలి

ఫీజుల దోపిడీని అరికట్టాలి