
పోలీసులకు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
ఉలవపాడు: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు గురువారం ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించి వివాదాలు సృష్టించే విధంగా ఉన్న ఈ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు పోతురాజు, సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడు మధుసూదన్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నవీన్, ఐటీ వింగ్ అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు దస్తగిరి, సుధాకర్, అమ్మనబ్రోలు బ్రహ్మయ్య, సురేంద్ర, తాటిపర్తి రమేష్‌లున్నారు.