విద్యారంగాన్ని విస్మరించారు
బడ్జెట్‌లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారు. బడ్జెట్‌లో ప్రభుత్వ విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ చేసిన సూచనలు పూర్తిగా విస్మరించారు. పాఠశాల విద్యాశాఖకు బడ్జెట్‌లో 9.86 శాతం మాత్రమే నిధులు కేటాయించడం అన్యాయం. ‘నాడు–నేడు’ పెండింగ్ పనుల గురించి బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించ లేదు. మోడల్ ప్రైమరీ స్కూళ్లకూ ఎలాంటి నిధులు కేటాయించ లేదు. 12వ పీఆర్‌సీ, ఆర్థిక బకాయిలు చెల్లింపు ఊసే కూడా లేకపోవడం అన్యాయం.
– శెట్టిపి జయచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment