●గుంతకల్లుకు చెందిన రోషన్ ఆలీకి ఇరవై ఏళ్లు. తండ్రి మటన
●అనంతపురంలోని పాతూరుకు చెందిన షణ్ముగ వయసు 15 ఏళ్లు. చికెన్ అంటే మహా ఇష్టం. ఒక్క రోజులోనే కేజీ చికెన్ ఫ్రైచేసి ఇచ్చినా తినేస్తానంటాడు. నెలలో 10 రోజులు చికెన్ ఉండాల్సిందే అంటున్నాడు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: యుక్తవయసు పిల్లలు శాకాహారం కన్నా మాంసాహారానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మెజారిటీ పిల్లలు చికెన్ అంటే మరీ లొట్టలేసుకుని తింటున్నారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే చికెన్, మటన్ తింటున్న వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లా మూడవ స్థానంలో ఉన్నట్టు తేలింది. నేషనల్ న్యూట్రిషనల్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల పిల్లల్లో 75.3 శాతం మంది చికెన్ తింటున్నారు. తర్వాతి స్థానం 51.6 శాతంతో మటన్ ఆక్రమించింది. దేశంలో మాంసాహార వినియోగంఏపీలో ఎక్కువగా ఉండగా, అందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువేమీ కాదన్నట్టుంది.
కూరగాయలు, పండ్లు తినడంలో వెనుకంజ
ఉమ్మడి జిల్లాలో చిన్నారులు, కుర్రాళ్లు చికెన్, మటన్‌ను ఇష్టపడినట్టుగా కూరగాయలు, పండ్లపై మక్కువ చూపడం లేదు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అని జిల్లాకు పేరున్నా ఇక్కడ పండ్ల వినియోగం చాలా తక్కువగా ఉంది. 2–4 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో విటమిన్–ఏతో కూడిన తిండి, కూరగాయలు తినడంలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నట్టు తేలింది. పండ్లు, కూరగాయలు తినడంలో కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేపల లభ్యత బాగానే ఉన్నప్పటికీ చికెన్, మటన్‌తో పోలిస్తే తక్కువ వినియోగం ఉన్నట్టు తేలింది.
మాంసాహారంపైనే మక్కువ
ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది కుర్రాళ్లు మాంసాహారం తినడానికి రకరకాల కారణాలున్నాయి. వాటిని ఒక్కసారి చూస్తే...
కుటుంబ నేపథ్యంలో చిన్నప్పటినుంచే మాంసాహారంపై మక్కువ పెంచుకోవడం.
చికెన్ ఉత్పత్తులు ఎక్కువగా అందుబాటులో ఉండటం.
సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో కొనుగోలు స్థాయి పెరగడం.
మాంసాహారాన్ని సాధారణ మెనూగా భావించి వినియోగించడం.
యువతను ఎక్కువగా ఆకర్షించేలా విభిన్న రుచుల్లో మాంసాహార వంటకాలు ఉండటం.
మాంసాహార వినియోగం పెరుగుతున్న స్థాయిలో వ్యాయామం చేయడం లేదు.
వయసుకు మించి బరువు ఎక్కువగా ఉన్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఇదీ యుక్త వయసు పిల్లల ఆహారశైలి
75.3 శాతం మంది చికెన్‌పై అమితాసక్తి
కూరగాయలు, పండ్లు, పీచు పదార్థాలపై నిరాసక్తత
చేపల వినియోగంలో ఉమ్మడి జిల్లా టీనేజర్ల వెనుకంజ
●గుంతకల్లుకు చెందిన రోషన్ ఆలీకి ఇరవై ఏళ్లు. తండ్రి మటన
Comments
Please login to add a commentAdd a comment