కబళించిన మృత్యువు
పెళ్లయిన నెల రోజులకే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కొద్దిసేపటి క్రితం ఆనందంగా గడిపిన భర్త విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన భార్య కన్నీరుమున్నీరైంది. అల్లా నాకు ఇంకెవరు దిక్కు అంటూ ఆమె రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మృతుడి తమ్ముడి పరిస్థితి విషమంగా ఉంది.
కదిరి టౌన్: మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తపాలా ఉద్యోగి మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన దాదాపీర్(25) తపాలా ఉద్యోగిగా అగళిలో పని చేస్తున్నాడు. శనివారం ఇంటర్ పరీక్షలు రాసిన తన తమ్ముడు సయ్యద్‌బాషాను బ్లూమూన్ కళాశాల నుంచి తన బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. కుటాగుళ్ల సర్కిల్ వద్ద పులివెందుల రోడ్డుపై ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో దాదాపీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌బాషాను అక్కడి నుంచి కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. సయ్యద్‌బాషా కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మిన్నంటిన రోదనలు..
దాదాపీర్ నెల రోజుల క్రితం కుటాగుళ్లకు చెందిన అల్పియాను వివాహం చేసుకున్నాడు. దాదాపీర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న భార్య, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు పెద్దసంఖ్యలో ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఈసందర్భంగా మృతుడి భార్య, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. దేవుడా మాకు ఇంత అన్యాయం చేశావా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ బాబ్జాన్ తెలిపారు.
పెళ్లయిన నెలరోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మృతుడు తపాలా ఉద్యోగి
కబళించిన మృత్యువు
Comments
Please login to add a commentAdd a comment