విలీనం.. నిరసనాగ్రహం
చెన్నేకొత్తపల్లి: మండల పరిధిలోని న్యామద్దెల గ్రామంలోని దళితవాడలోని ప్రాథమిక పాఠశాలను గ్రామంలోని మరో పాఠశాలలో విలీనం చేసేందుకు శనివారం పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాలలను విలీనం చేసి మోడల్ పాఠశాలగా చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని తెలపగా, తల్లిదండ్రులు తీవ్ర అభ్యతరం తెలిపారు. తమ పిల్లలకు ‘మోడల్ స్కూల్’ అవసరం లేదని, ఇప్పుడున్న పాఠశాలను కొనసాగిస్తే చాలన్నారు. పాఠశాలలో 50 మందికిపైగా విద్యార్థులు ఉన్నారని, వారి భవిష్యత్‌తో ఆడుకోవద్దని వేడుకున్నారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల గేటు ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘విలీనం’ అలోచనను అధికారులు మానుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. దీంతో ఉపాధ్యాయులు ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment