
ఆయుర్వేద డాక్టర్ల జిల్లా కమిటీ ఏర్పాటు
హిందూపురం టౌన్: స్థానిక ఫాతిమా క్లినిక్ వేదికగా ఆదివారం జిల్లా ఆయుర్వేద వైద్యులు సమావేశమై నూతన కమిటీను ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షురాలిగా డాక్టర్ అనురాధ, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ఇమ్రాన్ ఖాన్, జనరల్ సెక్రెటరీగా డాక్టర్ తేజ, ట్రెజరర్‌గా డాక్టర్ మధు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా డాక్టర్ షాహిద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కమిటీలు విస్తరించాయని, ఇందులో భాగంగా జిల్లాలో కూడా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
జూదరుల అరెస్ట్
హిందూపురం: స్థానిక చెర్లోపల్లి–పత్తికొండ మార్గంలో పేకాట ఆడుతున్న 17 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ చంద్ర ఆంజనేయులు తెలిపారు. అందిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తనిఖీలు చేపట్టామన్నారు. చెర్లోపల్లి సమీపంలోని కొండ వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని ‘లోపల–బయట’ ఆట ఆడుతూ 17 మంది పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.81 వేల నగదు, పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని జూదరులతో పాటు కేంద్రం నిర్వాహకుడు అశ్వత్థప్పపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు వివరించారు.
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
నల్లమాడ: మండలంలోని వేళ్లమద్ది గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన కె.వెంకటపతి, వెంకటలక్ష్మి దంపతుల రెండో కుమారుడు కె.ప్రేమసాయి(20) ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరులోని ఓ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రేమసాయి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల క్రితం కళాశాల నుంచి ఇంటికి వచ్చాడు. కడుపునొప్పి తీవ్రత తాళలేక ఆదివారం మధ్యాహ్నం కళింగర పంటకు పిచికారీ చేయగా మిగిలిన పురుగుల మందును తాగాడు. అపస్మారకస్థితికి చేరుకున్న కుమారుడిని గుర్తించిన తల్లిదండ్రులు 108 అంబులెన్స్ ద్వారా కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఆయుర్వేద డాక్టర్ల జిల్లా కమిటీ ఏర్పాటు

ఆయుర్వేద డాక్టర్ల జిల్లా కమిటీ ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment