
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
కదిరి టౌన్: స్థానిక మారుతీనగర్‌కు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత ఉద్యోగి పెద్దపల్లి లక్ష్మణ్ కుమారుడు పి.అవినాష్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి భోజనం ముగించుకుని కింద ఉన్న ఇంట్లోకి పడుకోవడానికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తలుపులు బద్ధలుగొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతున్న అవినాష్‌ను గమనించి, ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అవినాష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, బీటెక్ పూర్తి చేసిన అవినాష్... పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సాయి బాట .. సత్కర్మకు రాచబాట
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయం: ‘సత్యసాయి బాబా చూపిన ఆధ్యాత్మిక సేవా మార్గమే మానవులు సత్కర్మను ఆచరించడానికి రాచమార్గం’ అనే సందేశాన్నిస్తూ నిర్వహించిన ‘కర్మ’ నాటిక భక్తులను ఆకట్టుకుంది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత భక్తిరస సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి యూత్ సత్యసాయిపై భక్తిభావన, ప్రేమను చాటుతూ సంగీత కచేరీ నిర్వహించారు. అనంతరం జిల్లాకు చెందిన సత్యసాయి యూత్ బృందం ప్రదర్శించిన కర్మ నాటిక అందరనీ ఆకట్టుకుంది. తర్వాత భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.

పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య

పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment