పుట్టపర్తి: జిల్లాలోని 42 కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 514 మంది విద్యార్థులు గైర్హాజయ్యారు. జనరల్ విద్యార్థులు 12,162 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 11,749 మంది, ఒకే షనల్ కోర్సులకు సంబంధించి 1,696 మందికిగానూ 1,595 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు.
కలుషిత నీరు తాగి గొర్రెల మృతి
బ్రహ్మసముద్రం: కలుషిత నీరు తాగి 24 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి పంచాయతీ ముద్దలాపురం గ్రామానికి చెందిన ఎరికల రామన్న... గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు లాగే మంగళవారం జీవాలను మేపునకు తోలుకెళ్లాడు. మధ్యాహ్నం సమీపంలోని తోటలో మొక్కజొన్న పంటకు డ్రిప్ ద్వారా వదిలేందుకు యూరియా కలిపిన నీటిని గొర్రెలు తాగాయి. కాసేపటి తర్వాత ఒకదాని వెనుక ఒకటి చొప్పున మృతి చెందాయి. సమాచారం అందుకున్న పశువైద్యాధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కలుషిత నీరు తాగడం వల్లనే గొర్రెలు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనతో రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment