ఇదెక్కడి నవోదయం?!
కదిరి అర్బన్: ప్రతి కార్యక్రమానికి రెండు కోణాలు ఉంటాయని పెద్దలు అంటుంటారు. అలాగే నవోదయం 2.0 కార్యక్రమానికి రెండో కోణం కదిరిలో బహిర్గతమైంది. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నవోదయ 2.0 సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు గోడల మధ్య అధికారులందరూ సమావేశమై నాటుసారా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అయితే అదే సమయంలో సమావేశం జరుగుతున్న భవనానికి కూతవేటు దూరంలో కొందరు ఫుల్‌గా నాటుసారా సేవించి రోడ్డు పక్కనే మత్తులో పడిపోయారు. మరికొందరు తూలుతూ వాహనాల కిందపడి గాయాలపాలయ్యారు. ఇదంతా గమనించిన పలువురు ‘అయ్య బాబోయ్ ఇదెక్కడి నవోదయం’ అంటూ చర్చించుకోవడం గమనార్హం.
ఇదెక్కడి నవోదయం?!
Comments
Please login to add a commentAdd a comment