నెలాఖరులోపు టార్గెట్ పూర్తి కావాలి
అనంతపురం అగ్రికల్చర్: నెలాఖరులోపు నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.రామాంజినేయులు ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం స్థానిక మార్కెటింగ్‌శాఖ కార్యాలయంలో రెండు జిల్లాల ఏడీఎంలు పి.సత్యనారాయణచౌదరి, ఎల్‌ఎన్ మూర్తితో కలసి మార్కెట్ కమిటీ ఆదాయ వనరులపై సెక్రటరీలు, సూపర్‌వైజర్లతో సమీక్షించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫీజు వసూళ్లలో రెండు జిల్లాలు నిర్దేశించిన శాతానికన్నా ఎక్కువ ప్రగతి సాధించాలన్నారు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది రూ.12.06 కోట్లకు గానూ 82 శాతంతో రూ. 9.97 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.5.31 కోట్లకు గానూ 82 శాతంతో రూ.4.37 కోట్లు సాధించినట్లు తెలిపారు. రాప్తాడు, ఉరవకొండ, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురం కమిటీలు వెనుకబడినందున ఆర్థిక సంవత్సరం ముగిసే ఈ 25 రోజుల్లో ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. పశువులు, జీవాలు, మిరప, చింతపండు, చీనీ మార్కెట్లలో లీకేజీలు అరికట్టాలని, రెన్యువల్స్, గోదాముల అద్దెలు పూర్తి స్థాయిలో వసూలు చేయాలని ఆదేశించారు. మార్కెట్ కమిటీల్లో ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే 2025–26కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసి పంపాలన్నారు. ఈ ఏడాది కన్నా వచ్చే ఏడాదికి టార్గెట్లు పెంచుకుని లక్ష్య సాధనకు గట్టిగా పనిచేయాలని సూచించారు.
మార్కెటింగ్‌శాఖ ఆర్జేడీ
రామాంజినేయులు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment