మడకశిరరూరల్: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025–2026 సంవత్సరానికి (ఇంగ్లిష్ మాధ్యమం) ప్రవేశ పరీక్షకు బాలురు, బాలికల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గురుకుల పాఠశాల, కళాశాల కన్వీనర్ రమాదేవి తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియట్ (ఇంగ్లిష్ మాధ్యమం) ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 15 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చని పేర్కొన్నారు. బాలికలకు (టేకులోడు, గుండిబండ, బాలురకు లేపాక్షి, గుండుమల కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ఆస్తకి గల అభ్యర్థులు ఈ నెల 15 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment