బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం
● పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచాలి
రెండో రోజూ కొనసాగిన ఆర్డీఓ విచారణ
పుట్టపర్తి టౌన్: ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింతగా పెంచాలంటూ ప్రొబేషనరీ ఎస్‌ఐలకు ఎస్పీ రత్న సూచించారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న పలువురు ప్రొబేషనరీ ఎస్‌ఐలు గురువారం డీపీఓలోని చాంబర్‌లో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటే కేసుల దర్యాప్తులో మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. నాలుగు నెలల గ్రేహౌండ్స్ శిక్షణలో భాగంగా బేసిక్ పోలీసింగ్ విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఓ సుజాత, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పట్టపగలే చోరీ
రాయదుర్గం టౌన్: స్థానిక మారెమ్మ గుడి ప్రాంతంలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు... ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న మంజునాథ్ భార్య స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంటికి తాళం వేసి ఆటో అద్దెల కోసం మంజునాథ్, ఆయన భార్య ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి ఇంటికి చేరుకున్న మంజునాథ్.. అప్పటికే ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించాడు. లోపల వస్తువులన్నీ చెల్లాచెదురు చేసి ఓ క్యారియర్‌లో దాచి ఉంచిన రూ.80 వేలును అపహరించి, ఇంటి వెనుక ఉన్న మరో తలుపు నుంచి దుండగులు ఉడాయించినట్లుగా గుర్తించాడు. బీరువాకు వేసిన తాళం తీసేందుకు విఫలయత్నం చేశారని, బీరువా తలుపు తెరుచుకోకపోవడంతో అందులో ఉంచిన బంగారు నగలు భద్రంగా ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు.
మట్కా నిర్వాహకుల అరెస్ట్
తాడిపత్రి టౌన్: స్థానిక పలు ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. పట్టుబడిన వారిలో వైఎస్సార్ జిల్లా బాపనపల్లికి చెందిన కొండమనాయుడు, తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్ నివాసి నాగల మణికంఠ, భగత్‌సింగ్ నగర్‌కు చెందిన సుబ్బరాయుడు, చాకలి ఆదినారాయణ ఉన్నారు. వీరు గురువారం ఉదయం తాడిపత్రిలోని ఆర్టీసీ బస్డాండ్ వద్ద అరెస్ట్ చేసి రూ.30వేలు నగదు, పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటక మద్యం విక్రేతల అరెస్ట్
హిందూపురం అర్బన్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో బుధ, గురువారాల్లో చేపట్టిన తనిఖీల్లో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న పలువురు పట్టుబడ్డారు. వీరి నుంచి 418 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్బుడిన వారిలో హిందూపురం మండలం కొల్లకుంటకు చెందిన వెంకటేష్, కొడిగెనహళ్లికి చెందిన గిరీష్‌కుమార్, గోళ్లాపురానికి చెందిన జయలక్ష్మి, మేళాపురానికి చెందిన లత, లక్ష్మి, సదాశివనగర్ నివాసి భూపతి ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐలు గురునాథరెడ్డి, లక్ష్మీదుర్గయ్య తెలిపారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
రామగిరి: మండల కేంద్రానికి చెందిన తలారి రాజన్న (48) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలేపల్లి సరిహద్దులో ఉన్న రాజన్న పొలం పక్కనే మరొకరికి సంబంధించిన పొలం ఉంది. వీటి మధ్య ఉన్న వేప చెట్టు తమకు చెందుతుందంటే తమకు చెందుతుందని బుధవారం ఇరువురు రైతులు వాదించుకున్నారు. అనంతరం రాజన్న ఇంటికి చేరుకున్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాజన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య శ్యామల చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ముదిగుబ్బ: మండలంలోని ఏబీపల్లి తండాలో గిరిజన, గిరిజనేతర భూములను ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఆక్రమించిన అంశంపై ధర్మవరం ఆర్డీఓ మహేష్ గురువారం రెండవ రోజు గురువారం కూడా విచారణ చేపట్టారు. ఆరోపణలు ఉన్న సర్వే నంబర్ 1858, 1962, 1963, 1809లలో ఉన్న భూములను ఆర్డీఓ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఏబీపల్లికి చెందిన బాధిత రైతులు రవిశంకర్ నాయక్, గాయత్రి బాయి, నారాయణమ్మ, జయమ్మ, కుల్లాయప్ప నాయక్, బాలునాయక్‌తో మాట్లాడారు. తమ భూములను ఎంపీపీ ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నాడని, ఆ భూములపై బ్యాంకులలో రుణాలను కూడా తీసుకోవడం అన్యాయమని, తమ వద్ద భూములకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆర్డీఓ దృష్టికి వారు తీసుకెళ్లారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంటలు పెట్టలేకపోయామని, గతంలో చాలా సార్లు పంటలు సాగు చేసి పెట్టుబడులు కూడా రాకపోవడంతో ప్రస్తుతం పంటలు సాగు చేయలేక బీళ్లుగా పెట్టుకున్నామన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ... అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు.
బొమ్మనహాళ్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన తలారి హనుమంతు, పార్వతి దంపతుల కుమారుడు లోకేష్ (35)కు ఏడేళ్ల క్రితం కల్లుహోళ గ్రామానికి చెందిన అంజలితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సొంతూరిలోనే ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న లోకేష్ బుధవారం వ్యక్తిగత పనిపై బొమ్మనహాళ్‌కు వచ్చాడు. పనిముగించుకుని రాత్రి ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాడు. నేమకల్లు చెక్‌పోస్టు దాటగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో లోకేష్‌కు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు తమిళనాడుకు చెందిన రాజుకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రాజును కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. లోకేష్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు. కాగా, బాధిత కుటుంబసభ్యులను వైఎస్సార్‌సీపీ సర్పంచ్ పరమేశ్వర పరామర్శించి, అండగా ఉంటామని భరోసానిచ్చారు.
బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం
బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం
బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం
బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment