చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలి
ప్రశాంతి నిలయం: చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్ లో చిత్తడి భుముల పరిరక్షణ, నిర్వహణ అన్న అంశాలపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా చిత్తడి నేలల డేటాను సేకరించి నివేదిక ఇవ్వాలని డీఎఫ్‌ఓను ఆదేశించారు. మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి కమిటీ సభ్యులుగా తహసీల్దార్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నీటిపారుదలశాఖ ఇంజనీర్, ఈఓఆర్డీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ అభిషేక్ కుమార్, జిల్లా అటవీ అధికారి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
తాడిమర్రి: ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం వచ్చే గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం వైద్యాధికారులకు ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాన్పుల గది, ల్యాబ్, మందుల గది, ఓపీ తదితర గదులను పరిశీలించి, రికార్డులను పరిశీలించారు. ఏడాది వయసులోపు చిన్నారులు, బాలింతల మరణాల గురించి ఆరాతీశారు. అలాగే గర్భిణీలు ప్రసవం కోసం 108 వాహనాన్ని వినియోగించుకుంటున్నారా, ప్రసవానికి ప్రభుత్వా ఆస్పత్రికి వస్తున్నారా లేదా అని విచారించారు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారు చాలామంది పేద కుటుంబాలకు చెందిన వారని, వారిని ప్రేమతో పలకరించి వైద్య సేవలు అందిస్తే సంతోషిస్తారన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు హరిత, గోవర్ధన్‌నాయుడు, హెల్త్ సూపర్‌వైజర్ రాంకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment