నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఆది యందు ‘ఆమె’ ఉండెను
అప్పటి నుంచీ అన్నీ ‘ఆమె’ అయెను...
బడిలో, గుడిలో, నారుమడిలో..
ఆమెలేని చోటులేదు.. ఆమెకు సాటి లేదు..
కలం పట్టినా... హలం దున్నినా..
అధికారం చూపినా.. అక్కున చేర్చుకున్నా..
అంతా ఆమె... అన్నింటా ఆమె..
సృష్టి, స్థితి, లయకారులకూ ‘ఆమె’నే ధైర్యం..
‘ఆమె’కెన్నో రూపాలు.. మనం కూడా ప్రతిరూపాలమే..
ఆమె ఒక ధైర్యం.. ఆ ఆదరణ లేకపోతే అంతా శూన్యం..
ఆమెను దలిస్తే అన్నీ దర్శించినట్టే..
అందుకే ఆమె కోసం ఓ రోజు..
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బతుకుపాఠంలో చెరగని ముద్ర వేసిన మహిళామణుల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
●వివిధ రంగాల్లో మహిళల ప్రతిభ ●పురుషులతో దీటుగా రాణిస్తున్న వైనం
బొమ్మలకే అమ్మ.. శివమ్మ
ఆమె చేతిలోని బొమ్మ అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుంది. తోలుతో చేసిన ఆ బొమ్మకు ప్రాణం పోసి అమ్మ శివమ్మ. ధర్మవరం మండలం నిమ్మల కుంటకు చెందిన తోలుబొమ్మల కళాకారిణి శివమ్మ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఏడు పదుల వయస్సులోనూ కళపై ఆమెకున్న మమకారం అచంచలం. అందుకే ఆదరణ కోల్పోయిన తోలుబొమ్మలతో నూతన అడుగులు వేస్తోంది. ఎంతో అందమైన చిత్రాలను తయారు చేస్తూ అబ్బుర పరుస్తోంది. విశ్వరూప హనుమాన్, రామాయణ, సుందరకాండ ఘట్టాలు, శ్రీకృష్ణలీలలు తదితర చిత్రాలను వినూత్నమైన డిజైన్‌లలో తోలుబొమ్మలను తయారు చేస్తోంది. అంతేకాక ల్యాంప్ సెట్‌లు, డోర్ హ్యాంగర్స్, తోలుబొమ్మలను మన దేశంలోని వివిధ దేశాలకూ ఎగుమతి చేస్తోంది. శివమ్మ ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ అవార్డు, గత ఏడాది ‘శిల్పగురు’ జాతీయ అవార్డుతో సత్కరించింది. ఈ ఏడాది పరంపరాగత్ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకుంది. కృషి, పట్టుదల ఉంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోంది శివమ్మ. – ధర్మవరం:
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment