‘కరుణ’జ్యోతి
ఇక్కడ ఓ వృద్ధురాలికి తల దువ్వుతూ కనిపిస్తున్న మహిళ పేరు అరుణజ్యోతి. స్వగ్రామం మండల కేంద్రమైన అమడగూరు. 16 ఏళ్ల వయసున్నపుడే వరుసకు మేనమామకు ఇచ్చి వివాహం జరిపించారు తల్లిదండ్రులు. పెళ్లయిన పదేళ్లకే భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే బుద్ధిమాంద్యంతో పుట్టిన కుమారుడికి అన్నీ తానైంది అరుణజ్యోతి. కుమారుడిని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్తున్న క్రమంలో బుద్ధిమాంద్యులు, అనాథలు పడే ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయింది. వారికోసం ఏదో ఒకటి చేయాలనే తలంపుతో అనాథ వృద్ధులకు అండగా నిలవాలని నిశ్చయించుకుంది. నాలుగేళ్ల కిత్రం తనకున్న బంగారు నగలను విక్రయించి వచ్చిన సొమ్ముతో అమడగూరు మండలం, గాజులపల్లి సమీపంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసింది. తనకు, బుద్ధిమాంద్యుడైన కుమారుడికి ఇచ్చే పింఛను డబ్బుతో ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 20 మంది వృద్ధులతో పాటుగా ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఎక్కడైనా వృద్ధులు ఆలనాపాలనా లేక రోడ్డుమీద ఉంటున్నారని తెలిస్తే చాలు అరుణజ్యోతి చలించిపోయింది. ఎంతదూరమైనా వెళ్లి వారిని ఆశ్రమానికి తీసుకువస్తుంది. చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో ఒడి, దుడికులను ఎదుర్కొన్నా... కుంగిపోకుండా ధైర్యంగా నిలబడి అనాథ వృద్ధులకు సేవ చేసుకుంటూ పలువురి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment