రైలులో తమిళనాడు వాసి మృతి
ధర్మవరం: అనారోగ్యంతో రైలులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన ధర్మవరంలో శనివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అత్తూరు తాలూకాకి చెందిన శ్రీనివాసం దురైస్వామి(46)కి మూడునెలల క్రితం స్వగ్రామంలో కుక్క కరిచింది. వైద్యం చేయించుకోకుండా బోర్‌వెల్ పనిచేసేందుకు మహారాష్ట్రలోని ఒక గ్రామానికి వెళ్లాడు. కుక్క కరిచిన చోట ఇన్ఫెక్షన్ అయి అనారోగ్యానికి గురికావడంతో మహారాష్ట్ర నుంచి స్వగ్రామానికి రైలులో బయలుదేరాడు. రైలు ధర్మవరం రైల్వేస్టేషన్‌లోకి చేరుకునే సమయానికి దురైస్వామి మృతి చెందాడు. రైలులో ఉన్న ప్రయాణికులు ధర్మవరం రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ప్రసన్న, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment