
ఎస్సీ, ఎస్టీ కేసులంటూ వేధిస్తున్నారు
ప్రశాంతి నిలయం: విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసుల పేరుతో బెదిరిస్తున్నారని, తమను రక్షణ కల్పించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు వారు సోమవారం జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. గత శుక్రవారం సాయంత్రం పెడపల్లి సచివాలయానికి రంగప్ప, తిప్పన్న అనే వ్యక్తులు వచ్చి రూ.1.5 లక్షలకు ఇంటి పన్ను మదింపు సర్టిఫికెట్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని అడిగారన్నారు. వారిచ్చిన ఆధారాల మేరకు అంత మొత్తానికి సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలియజేస్తే సదరు వ్యక్తులు ఆగ్రహంతో ఊగిపోతూ దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి ప్రయత్నించారన్నారు. మీరెలా విధులు నిర్వహిస్తారో చూస్తామంటూ బెదిరించారని, అంతటితో ఆగకుండా నలుగురు సచివాలయ ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గోపాల్‌రెడ్డి, ప్రభాకర్, సురేంద్ర, గణేష్, ఓం ప్రసాద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రక్షణ కల్పించాలని
జేసీకి ఉద్యోగుల వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment