పుట్టపర్తి/పెనుకొండ రూరల్: ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఆయా నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
● పెనుకొండలో జరిగిన కార్యక్రమంలో ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. గత 15 సంవత్సరాలుగా జగన్‌కు అండగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహులు, సుధాకరరెడ్డి, నగర పంచాయతీ వైస్ చైర్మెన్ సునీల్, వైశాలి జయశంకర్‌రెడ్డి, మాజీ కన్వీనర్ నాగలూరు బాబు, కౌన్సిలర్లు శేషాద్రి, యాసిన్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.
● పుట్టపర్తిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబులపతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● ధర్మవరంలోమాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున జరిగింది. పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆవిష్కరించారు.
● మడకశిరలో పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం దినోత్సం ఘనంగా జరిగింది. అంతకు ముందు ఆయన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
● కదిరిలో పార్టీ సమన్వయర్త మగ్బుల్ అహమ్మద్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయ ఆవరణలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, వజ్ర భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● హిందూపురంలో పార్టీ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బలరామిరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రజాహితమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం