ధర్మవరం రూరల్: మండలంలోని సీతారాంపల్లి వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా బెంగళూరు వైపు తరలిస్తున్న 76 బస్తాల (ఒక్కొక్కటి 50 కిలోలు) రేషన్ బియ్యాన్ని బుధవారం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్‌ఐ శ్రీనివాసులు వెల్లడించారు. పోలీసులను చూడగానే వాహనాన్ని ఆపి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వెంబండించి అదుపులోకి తీసుకునానమన్నారు. పట్టుబడిన వారిని సోమందేపల్లికి చెందిన షేక్ బాబా, వడ్డె అజయ్‌గా గుర్తించామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు.