పలాస, కాశీబుగ్గ: పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు, గాయకుడు సాలిన అశోక్‌కుమార్(31) శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన జాతీయ రహదారి రోడ్డు పనుల్లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి నుంచి తన స్కూటీపై వెళ్తుండగా మాకన్నపల్లి రోడ్డు మలుపు వద్ద ఎదురుగా వచ్చిన బొలేరో లగేజ్ వ్యాను ఢీకొనడంతో అక్కడికక్కడే ఊపిరి వదిలేశాడు. విషయం తెలిసిన వెంటనే పరిసర గ్రామ ప్రజలంతా అక్కడకు చేరుకొని భోరున విలపించారు.
కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. వారి రోదన ఆపడం ఎవరి తరం కాలేదు. అలాగే ఉద్దానం ప్రాంతానికి చెందిన కళాకారులు, గాయకులు అక్కడకు చేరుకొని అతని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మృతదేహాన్ని కాశీబుగ్గ పోలీసులు సంఘటన స్థలం నుంచి పలా స ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామం మాకన్నపల్లికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. ఈ సందర్భంగా ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఉపాధ్యక్షుడు కుత్తుం వినోద్ ఆద్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.
కవులు, రచయితలు డాక్టరు కుమార్‌నాయక్, పత్తిరి తాతారావు, కిక్కర ఢిల్లీరావు, సిక్కోలు జానపద వేదిక అధ్యక్షుడు రాపాక ధనరాజు, మల్లేన దేవరాజు, రంగోయి తులసి, జానపద పరిశోధకుడు బద్రి కూర్మారావు, వంకల రాజారావు తదితరులు సంతాపం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment