మహిళ అనుమానాస్పద మృతి
కాశీబుగ్గ : పలాస రైల్వేస్టేషన్‌లో శనివారం ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం మరదరాజపురం గ్రామానికి చెందిన జంగం రాధ(39)కు ఒడిషా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖిమిడికి చెందిన శ్రీనివాస పండాతో వివాహం జరిగింది. పదేళ్ల కిందట భర్త మృతిచెందడంతో రాధ కన్నవారింటికి వచ్చేసింది. పలాస వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఎఫ్‌సీ గోదాములో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా పలాస రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పద రీతిలో విగతజీవిగా కనిపించింది. ఈమెకు పాప, బాబు ఉన్నారు. మృతదేహాన్ని జీఆర్‌పీ ఏడీ మెట్ట సోమేశ్వరరావు పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీ ఢీకొని యువకుడు దుర్మరణం
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడు జాతీయ రహదారిపై సాహూ దాబా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమా దంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. లక్ష్మి పురం టోల్‌ప్లాజాలో సీసీ ఫుటేజీ విభాగంలో పనిచేస్తున్న మందస మండలం అంబుగాం గ్రామానికి చెందిన బల్ల పాపారావు (32) శనివారం మధ్యాహ్నం విందు భోజనానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టింది. అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన పాపారావును హైవే అంబులెన్సులో పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. పాపారావుకు తల్లిదండ్రులు, ముగ్గురు అక్కచెల్లెల్లు ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తండ్రి మాధవరావు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాశీబుగ్గ ఎస్‌ఐ చంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment