గర్జిద్దాం రండి
కన్నీరే మిగిలిందిక నేస్తం..కిడ్నీ బాధితుల కష్టాలు అంతులేనివి. ప్రాణాలతో పాటు ఆస్తులు కూడా హరించుకుపోతున్నాయి. –8లో
విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టనుంది. యువత పోరు పేరుతో 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సిద్ధమైంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి చెమటలు పట్టేలా ఈ ఆందోళన నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సర్కారు మొద్దు నిద్ర వీడేలా నినదించాలని కోరారు. కార్యక్రమానికి శ్రేణులను సమాయత్తం చేస్తూ పార్టీ నేతలు అన్ని నియోజకవర్గాల్లో సోమవారం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థి లోకానికి తోడుగా ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
గర్జిద్దాం రండి
గర్జిద్దాం రండి
Comments
Please login to add a commentAdd a comment