కొనసా..గుతున్న పడిగాపులు
● గ్యాస్ సరఫరా కాక ప్రజల ఇబ్బందులు
పొందూరు: స్థానిక ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు సోమవారం కూడా పడిగాపులు తప్పలేదు. గత పది రోజులుగా గ్యాస్ సరఫరా కాకపోవడంతో కస్టమర్లకు వంట తిప్పలు తప్పడం లేదు. పొందూరు ఏజెన్సీ బాధ్యతలను రణస్థలం, వజ్రపుకొత్తూరు ఏజెన్సీలకు అప్పగించారు. ఈ మేరకు రణస్థలం ఏజెన్సీ స్పందన సరిగ్గా లేకపోయిన్పటికీ వజ్రపుకొత్తూరు ఏజెన్సీ స్పందించింది. సోమవారం నుంచి గ్యాస్ సరఫరా చేయనున్నట్లు ప్రచారం జరగడంతో పలువురు గ్యాస్ ఆఫీసుకు మధ్యా హ్నం 2 గంటలకు చేరుకున్నారు. గ్యాస్ ఆఫీసుకు వజ్రపుకొత్తూరు సిబ్బంది వచ్చా రు. అయితే ఆన్‌లైన్‌లో సమస్య తలెత్తింది. దీంతో సాయంత్రం 6 గంటల వరకు గ్యాస్ కస్టమర్లు ఆఫీసుకు రావడం, వెళ్లడం మాత్రమే జరిగింది. గ్యాస్ ఆఫీసుకు వచ్చిన వారందరికీ మంగళవారం నుంచి గ్యాస్ సరపరా చేస్తామని చెప్పి పంపించేశారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి పలువురు ఆటోల్లో సిలిండర్లు తీసుకువచ్చారు. ఆటోలకు ఎక్కువ చార్జీలు చెల్లించి అక్కడే గంటల తరబడి ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉసూరుమని వెనుదిరిగారు. మంగళవారమైనా గ్యాస్ సరఫరాను కచ్చితంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తప్పెవరిది..
శిక్ష ఎవరికి?
కొనసా..గుతున్న పడిగాపులు
Comments
Please login to add a commentAdd a comment