తొలిరోజు 685 మంది గైర్హాజరు
●ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాశారు. తొలిరో జు సెట్–2 ప్రశ్న పత్రంతో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒరియా పేపర్లకు విద్యార్థులు పరీక్ష రాశారు. పునర్విభజన శ్రీకాకుళం (30 మండలాలు)జిల్లా వ్యాప్తంగా 75 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు తొలిరోజు మొత్తం 21,127 మంది హాజరుకావాల్సి ఉండగా 20,442 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 685 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని అధికారులు ధ్రువీకరించారు. సోమవారం నుంచి సీనియర్ ఇంట ర్ పరీక్షలు మొదలుకానున్నాయి.
పరీక్ష కేంద్రాల పరిశీలన
జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను పలువురు అధికారులు చుట్టుముట్టా రు. తొలిరోజే ఆకస్మిక తనిఖీలతో హోరెత్తించారు. సెల్ఫ్ సెంటర్లు, ఎంపిక చేసుకున్న సెంటర్లపై ఫోకస్ చేస్తున్నారు. డీఈసీ–2 పీవీఎల్ నారాయణతో కలిసి జిల్లా స్పెషల్ ఆఫీసర్, డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు ఎచ్చెర్లలోని రెండు కేంద్రాలతోపాటు కొయ్యాం కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏర్పాట్లను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు, డిస్ట్రిక్ట్ బల్క్ అధికారి బి.శ్యామ్‌సుందర్, డీఈసీ–3 బి.సింహాచలంతో కూడిన బృందం శ్రీకాకుళంలోని పెద్దపాడు ఏపీ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయం, శ్రీచైతన్య జూనియర్ కళాశాల రెండు కేంద్రాలలో తనిఖీ లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. అలాగే కరెంట్ కోతలతో అటు విద్యార్థులు, ఇటు పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది అవస్థలు పడ్డారు.
తొలిరోజు సెట్–2 ప్రశ్న పత్రంతో పరీక్ష రాసిన ఫస్టియర్ విద్యార్థులు
నిమిషం నిబంధనతో అష్టకష్టాలు పడిన
విద్యార్థులు
తొలిరోజు 685 మంది గైర్హాజరు
తొలిరోజు 685 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment