రైలు ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి
పాతపట్నం: రైలు ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పాతపట్నం మండలం రంకిణి పంచాయతీ బగంతర గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జీబ బాలకృష్ణ(32)ను ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పాతపట్నం మహేంద్రతనయా నది బ్రిడ్జి సమీపంలో పూరి నుంచి గుణుపూర్ వెళుతున్న రైలు ఢీకొట్టింది. వెంటనే రైలు నిలిపివేసి క్షతగాత్రుడి వద్దకు రైల్వే సిబ్బంది వెళ్లగా ప్రాణం ఉందని తెలుసుకుని, వెంటనే అదే రైలులో పర్లాకిమిడి (ఒడిశా) తీసుకెళ్లారు. స్టేషన్‌కు చేరుకోగానే బాలకృష్ణ మృతి చెందాడు. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది పలాస రైల్వే ఆర్‌పీఎఫ్‌కు సమాచారం అందించామని రైల్వే అధికారులు తెలిపారు. బాలకృష్ణ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య జీబ భవాణి, రెండేళ్ల బాబు వర్ధన్ ఉన్నారు. రైలు వస్తున్న సమయంలో ట్రాక్‌పైకి బాలకృష్ణ ఎందుకు వెళ్లాడో తెలియాల్సి ఉంది.
పాతపద్ధతిలోనే ‘సాగు’తూ..
వజ్రపుకొత్తూరు రూరల్: సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకొని అన్నింటా యంత్రాలు, మోటార్లను వినియోగిస్తున్న ఈ రోజుల్లో కొంతమంది రైతులు వ్యవసాయంలో ఇప్పటికీ పాత పద్ధతులనే అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం సీతాపురం గ్రామానికి చెందిన రైతు తమ్మినాన మల్లేశ్వరరావు ఇప్పటికీ పూర్వ పంథానే అనుసరిస్తూ పలు రకాల కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. కేవలం సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ పంటకు నీరు పెట్టేందుకు యాతాన్ని ఏర్పాటు చేశారు. అతి తక్కువ పెట్టుబడితో సేంద్రియ వ్యవసాయం చేస్తూ లాభాలను అర్జిస్తున్నాడు. పంట సాగులో ఎలాంటి యంత్రాలు, మోటర్లు గానీ రసాయన ఎరువులను వినియోగించడం లేదు.
రైలు ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment