ఉత్కంఠగా కబడ్డీ పోటీలు
పలాస:
మండలంలోని బొడ్డపాడులో రెండో రోజు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. నరసన్నపేట జట్టుపై జిల్లుండ, ఎల్.కొత్తూరుపై గొల్లవూరు, మామిడిపల్లి జట్టుపై జెస్సీ టీం విజయం సాధించాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు మొత్తం 30 జట్లు రాగా ఇంకా విశాఖపట్నం, అనకాపల్లి తదితరు జట్లు తమ ప్రతిభను చాటుకోనున్నాయి. ఫ్లడ్ లైట్ల మధ్య పోరు సాగుతుండటంతో స్థానికులు, క్రీడాభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు యార్లగెడ్డ వెంకన్న చౌదరి, జిల్లా కార్యదర్శి చిరంజీవులు, ఉపాధ్యక్షులు రాపాక అప్పలస్వామి, బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షుడు తామాడ క్రాంతి, జైభీమ్ యువజన సంఘం అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment