నరకం
గంటల
రాజాం పైపు నిలిచిపోయిన భారీ వాహనాలు
పొందూరు పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాసేందుకు నడిచి వెళ్తున్న విద్యార్థులు
కూరుకుపోయిన భారీ లారీ
ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం
జి.సిగడాం: మండలంలోని దవళపేట గ్రామ సమీపంలో దారికి అడ్డంగా ఓ లారీ నిలిచిపోవడంతో ప్రయాణికులు నాలుగు గంటల పాటు నరకం చూశారు. రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారి, దవళపేట గ్రామ సమీపంలో కల్వర్టు పనులు జరుగుతున్నాయి. వాహనాల రాకపోకల కోసం పక్క నుంచి డైవర్షన్ రహదారి ఏర్పాటు చేశారు. ఈ రహదారిలో మంగళవారం వేకువజామున 2 గంటల సమయంలో అధిక లోడుతో వెళ్తున్న ఓ సిమెంట్ లారీ కూరుకుపోయింది. దీంతో రాజాం–శ్రీకాకుళం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు వాహనాలన్నీ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రహదారులు భవనాల శాఖ ఏఈఈ పీటీ రాజు సంఘటన స్థలానికి చేరుకుని లారీని యంత్రాల సాయంతో బయటకు తీయించారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించారు.
దవళపేట వద్ద ట్రాఫిక్ జామ్
డైవర్షన్ వద్ద మట్టిలో కూరుకుపోయిన భారీ లారీ
అవస్థలు పడిన ప్రయాణికులు
Comments
Please login to add a commentAdd a comment