
ధాన్యం కొనేదెప్పుడు అధ్యక్షా?
● శాసన మండలి
సమావేశాల్లో ఎమ్మెల్సీ నర్తు రామారావు
కవిటి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా శ్రీకాకుళంలో నేటికీ రైతుల వద్ద లక్షన్నర టన్నులకు పైగా ధాన్యం నిల్వలు ఉండిపోయాయని, వాటిని ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రశ్నించారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు ఎంతో ఆర్భాటంగా చివరి ధాన్యపు గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని ప్రచారాలు చేశారని, కానీ స్థానికంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు. రైతుల ఇళ్లు, కల్లాల వద్ద ధాన్యం నిల్వలు ఉండిపోయిన విషయమై గతంలో జిల్లా కలెక్టర్‌కు వివిధ మండలాల నుంచి రైతు సంఘాల నేతలు విన్నవించినా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైస్ మిల్లర్లకు టార్గెట్లు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment