మహిళా పోలీసుల ఆనందహేల
శ్రీకాకుళం క్రైమ్:
మహిళా దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మహిళా పోలీసుల వేడుకలు సందడిగా జరిగాయి. డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. శ్రీకాకుళం రూరల్, రెండో పట్టణ, మహిళా పోలీస్ స్టేషన్లకు చెందిన మహిళా పోలీసులు, స్థానిక కాకినాడ ఆదిత్య కళాశాల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో సందడి చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తన ఎదుగుదలలో మహిళల నిర్ణయాలే ప్రధాన భూమిక పోషించాయని, బ్యాక్‌బెంచ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన తాను ఐపీఎస్‌పై ఆసక్తి పెట్టడానికి ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌లుగా ఉన్న దంపతులే కారణమని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, సీఐలు పైడపునాయు డు, ఈశ్వరరావు, ఇమ్మాన్యుయల్ రాజు, ఎస్‌ఐలు హరికృష్ణ, రాము, జనార్ధన, మహిళా పోలీసుస్టేషన్ సీఐ త్రినేత్రి, ఎస్‌ఐ లక్ష్మి, చంద్రకళ అధిక సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా పోలీసుల ఆనందహేల
Comments
Please login to add a commentAdd a comment