లారీ చోరీకి విఫలయత్నం
ఇచ్ఛాపురం: పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ చేసిన లారీని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీ చేశారు. సకాలంలో పోలీసులు రంగంలోకి దిగడంతో తిరిగి లారీని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం లారీ కోసం వచ్చిన యజమాని పైల వాసుదేవరావుకు పార్కింగ్ ప్రదేశంలో వాహనం కనిపించలేదు. తోటి డ్రైవర్లను, చుట్టుపక్కల వారిని అడిగినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లారీ యజమాని ఫిర్యాదుచేశాడు. పట్టణ ఎస్సై ముకుందరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఒడిశా పరిధిలోని పితాతోళి గ్రామంలో లారీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరికి పాల్పడింది కటక్ చెందిన వ్యక్తిగా అనుమానించి నిందితుడిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment